🌍 ప్రపంచాన్ని కుదిపేసిన రష్యా దాడి – డ్రోన్ల ఫ్యాక్టరీని లక్ష్యం చేసుకున్న బాంబులు

puthin and Erdogan fight

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్‌లో నిర్మాణం జరుగుతున్న బైరక్తర్ డ్రోన్ల ఫ్యాక్టరీని రష్యా బాంబులతో పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఫ్యాక్టరీ నుంచి రేపటినుంచే 120 డ్రోన్లు రెడీ అవుతాయి అనే ఆశతో ఉన్న ఉక్రెయిన్‌కి ఇది భారీ షాక్.

టర్కీ డబుల్ గేమ్

బైరక్తర్ డ్రోన్లు తయారు చేసే బేకర్ కంపెనీ టర్కీకి చెందినది. ఒక వైపు టర్కీ రష్యా నుంచి 40% గ్యాస్ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ, మరో వైపు ఉక్రెయిన్‌కు డ్రోన్లు అమ్ముతోంది. ఈ ద్వంద్వ రాజకీయానికి పుతిన్ గట్టి చెక్ పెట్టాడు.

భారత్‌కు సైలెంట్ సంతృప్తి

ఈ డ్రోన్లే పాకిస్తాన్‌కు కూడా చేరి, సింధూర యుద్ధంలో భారత జవాన్లకు పెద్ద ఇబ్బందులు కలిగించాయి. అందుకే ఇప్పుడు ఫ్యాక్టరీ నేలమట్టం కావడం వల్ల భారతీయులు సంతృప్తిగా భావిస్తున్నారు.

రష్యా లాభాలు

టర్కీ రష్యా నుంచి $8 యూనిట్‌కి గ్యాస్ కొనుగోలు చేసి, అదే గ్యాస్‌ని గ్రీస్, ఇటలీ వంటి దేశాలకు $12కి అమ్ముతోంది. అంతేకాకుండా 8,000 కోట్ల పెట్టుబడులతో ఉక్రెయిన్‌లో కట్టిన డ్రోన్ ఫ్యాక్టరీని రష్యా ఒక్క దెబ్బతో మాయంచేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ముగింపు

ఈ దాడితో ఉక్రెయిన్ “రష్యా డ్రోన్లకు సమాధానం చెబుతాం” అనే కల ఒక్కసారిగా కూలిపోయింది. ఇక పుతిన్ అడుగులు యుద్ధంలో కొత్త గేమ్‌లా మారతాయనేది ప్రపంచ దృష్టి.

Exit mobile version